Header Banner

ఫ్రీమాంట్‌లో మినీ మహానాడు..! ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎన్ఆర్ఐల జోష్..!

  Fri May 30, 2025 08:12        Politics

టీడీపీ వ్యవస్థాపకుడు, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ‘మినీ మహానాడు-2025’ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘనంగా జరిగింది. ఫ్రీమాంట్‌లోని భీమవరం రుచులు బాంకెట్ హాల్‌లో ఈ ఈవెంట్‌ గురువారం రాత్రి ప్రారంభమై అంగరంగ వైభవంగా ముగిసింది. ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రత్యేకంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్‌కు నివాళులతో కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ ఈవెంట్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ పంచలింగాల నాగరాజు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, టీడీపీ నేత తిరునగరి జ్యోత్స్న తదితరులు వర్చువల్‌గా హాజరయ్యారు. అన్న ఎన్టీఆర్ ఆశయాల సాధనలో చంద్రబాబు, లోకేశ్ పాత్రను పొగిడారు. బీసీలకు ఎన్టీఆర్ ఇచ్చిన గుర్తింపు, ఐటీ రంగంలో చంద్రబాబు చేసిన కృషిపై ప్రసంశల వెల్లువ పోసారు. ఈ వేడుకకు భారీగా ఎన్నారైలు తరలిరావడంతో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మినీ మహానాడు చరిత్ర సృష్టించింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసి, టీడీపీ కేంద్రానికి పంపారు. లోకేశ్ ప్రతిపాదించిన 6 శాసనాలు, పీ-4 కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ అనుబంధం ప్రకటించారు. ఏపీలో అభివృద్ధి, బీసీ సంక్షేమం, బ్రాహ్మణ హితానికి చేస్తున్న కృషిపై వివిధ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చివరగా, ఈ వేడుకలో పాల్గొన్న అనేక మంది ఎన్ఆర్ఐలు, టీడీపీ కార్యకర్తలకు శ్రీకాంత్ దొడ్డపనేని కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!


ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..


బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!


చిక్కుల్లో క‌మ‌ల్ హాస‌న్‌.. బెంగళూరులో కేసు న‌మోదు! ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కన్నడిగుల‌ ఆగ్రహం..


ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!


కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!  


ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #MiniMahanadu2025 #NTRJayanthi #NRITDP #FremontCelebrations #NTRLegacy #TDPGlobal #ChandrababuLeadership #NaraLokesh #NRIPride #TDPUSA